30, జూన్ 2019, ఆదివారం


29, జూన్ 2019, శనివారం


27, జూన్ 2019, గురువారం


26, జూన్ 2019, బుధవారం


24, జూన్ 2019, సోమవారం


23, జూన్ 2019, ఆదివారం


22, జూన్ 2019, శనివారం


21, జూన్ 2019, శుక్రవారం


20, జూన్ 2019, గురువారం


18, జూన్ 2019, మంగళవారం


17, జూన్ 2019, సోమవారం


16, జూన్ 2019, ఆదివారం



15, జూన్ 2019, శనివారం


పూజ్య సద్గురు కందుకూరి శివానందమూర్తిగారి శివసాయుజ్యంతో భారతీయ ధార్మిక ఇతిహాసంలో ఒక అపురూప ఉజ్వల ప్రకరణం ముగిసింది. ఆరు దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ప్రజాజీవన, సేవారంగాల్లో లక్షల మందిని ప్రభావితులను చేసి ధర్మ మార్గాన నడిపించి, విలక్షణ పౌరులుగా తీర్చిదిద్దిన ఒక దివ్యశక్తి చరిత్రాత్మక జీవనయాత్ర చాలించింది. భారతజాతి ఒక మహా దేశికుడిని, గొప్ప దేశభక్తుడిని, తన ఉనికి చేతనే జగతికి దీవెనలందించిన ఒక మహాపురుషుడిని కోల్పోయింది. శివానందమూర్తిగారి మహాభినిష్క్రమణం ధార్మికరంగం బహుశా ఏనాటికీ పూడ్చుకోలేని వెలితి.
వేదయుగం నుంచి నేటి దాకా ఎందరో యోగులు, పెద్దలు, సద్గురువులు, అవతార పురుషులు, మహాజ్ఞానులు, మహాద్రష్టలు కోరినవారికి కొంగుబంగారమై, సాధకులకు బోధకులై, చేయిపట్టి తీరం దాటిస్తూనే ఉన్నారు. సర్వకాలాల్లో ఆధ్యాత్మిక రంగాన్ని సుసంపన్నం చేసిన మహనీయులు లెక్కకు మిక్కిలే అయినా సద్గురు శివానందమూర్తితో పోల్చదగిన మహత్తు మనకు తెలిసిన వేల ఏళ్ల భారతదేశ చరిత్రలో మరొకటి కానరాదు. బ్రహ్మజ్ఞానాన్ని లోకజ్ఞానంతో మేళవించి..మనుష్యుడికి మొట్టమొదట కావలసింది ప్రపంచ జ్ఞానమని ప్రబోధించి..దేశ క్షేమాన్ని కాంక్షించి, దేశంకోసమే, తపించి..దేశభక్తులను, ధర్మవీరులను తయారు చేయడమే పనిగా పెట్టుకుని..దేశ రక్షణకు, జనహితానికి, అమోఘంగా, అజ్ఞాతంగా నిస్వార్థంగా అనవరతం పాటుపడుతూ, భారతజాతి అభ్యున్నతి కోసం, సనాతన ధర్మ సంరక్షణకోసం, నిశ్శబ్దంగా, ప్రతిఫలాపేక్ష రహితంగా విరామమెరుగక పరిశ్రమించిన శివానందమూర్తిగారి వంటి ఆధ్యాత్మిక శిఖరాన్ని భారతజాతి మునె్నన్నడూ ఎరుగదు.
పైసా పనిచేసి పదివేల రూపాయల ప్రచారం ఆశించే మనుషులు కొల్లలుగా ఉన్న ఈ రోజుల్లో పదిలక్షల రూపాయల పనిచేసి పైసా ప్రచారాన్ని కూడా ఆపేక్షించని మహనీయుడు శివానందమూర్తిగారు. వెయ్యి పున్నములను కొనే్నళ్లకిందే దాటిన సుదీర్ఘ జీవనయానంలో ఆయన మూడోకంటికి తెలియకుండా ఎన్ని గుప్తదానాలు చేశారో, ఎటువంటి మహత్కార్యాలు చేశారో, ఏఏ రంగాల్లో ఏఏ రీతుల్లో అజ్ఞాతంగా ఎనె్నన్ని సేవలందించారో, దేశరక్షణకు సొంత ఖర్చుతో ఎన్ని యజ్ఞాలు చేయించారో, పూర్తిగా తెలిసినవారు బహుశా ఎవరూ లేరు. పిలిస్తే పలికే దైవంలా నమ్ముకున్న భక్తులకు ఆపదలు బాపేందుకు ఆయన చూపిన మహిమలు పైకి చాటుకోవడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండేది కాదు. లేని శక్తులు ఉన్నట్టుగా భ్రమగొలిపి, జనాకర్షణ, ధనాకర్షణలకు పాల్పడే కపట జీవులు కొల్లలుగా ఉన్నకాలంలో తన మహత్తును సాధ్యమైనంతవరకు పరుల కంటపడకుండా తనలోనే దాచుకుని, సాదాసీదా గృహస్థుగా జీవితం గడిపిన వాడాయన. గృహస్థాశ్రమంలోనే ఉంటూ పరమహంస పరివ్రాజకులైన జగద్గురుల చేతనే వందనాలందుకున్న మహాజ్ఞాని, ప్రత్యేకంగా ఏ గురువూ లేకుండా పుట్టుకనుంచే ఆత్మజ్ఞానం కలిగిన మహాయోగి శివానందమూర్తిగారు.
సంపన్న జమిందారీ కుంటుంబంలో పుట్టినా భోగభాగ్యాలను తృణప్రాయంగా భావించి, కట్టుబట్టలతో విశాల జనజీవితంలోకి అడుగుపెట్టిన అపర సిద్ధార్థుడు శివానందమూర్తిగారు. పోలీసు కొలువులో మధ్యస్థాయి కార్యాలయ ఉద్యోగిగా పనిచేస్తూనే పోలీసు శాఖలో ఉన్నతస్థాయిగల తన పై అధికారులచేత పాదాభివందనాలు చేయించుకున్నవాడాయన. సంగీత, నాట్యశాస్త్రాలను, పుక్కిట పట్టి కొమ్ములు తిరిగిన మహా సంగీత విద్వాంసులకు, మహానాట్యకారిణులకే ఆయా విద్యలలో వారు కలనైనా ఊహించని మెలకువలను నేర్పించగలిగిన మహా మహోపాధ్యాయుడాయన. ప్రపంచంలో ఏ రంగంలోని నిష్ణాతులతోనైనా పది నిమిషాలు ముచ్చటిస్తే చాలు ఆ రంగంలో వారికి ఏనాడూ తోచని కొత్తకోణాలు స్ఫురింపజేయగలిన నడిచే విజ్ఞానసర్వస్వం ఆయన. కాలేజీ విద్యార్థిగా గురుగోల్వార్కర్‌నుంచి నేరుగా స్ఫూర్తిపొంది, సామాన్య స్వయంసేవకునిగా పనిచేసిన శివానందమూర్తిగారు కాలక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి మార్గదర్శకుల్లో ఒకరుగా, మొత్తం హిందూ సమాజానికి, పెద్దదిక్కుగా భాసిల్లారు. సనాతన ధర్మ పునరుజ్జీవనానికి, భారతజాతి పునర్వైభవానికి ఆర్షసంస్కృతి పునరుత్థానానికి జీవితమంతటినీ అంకితం చేసి, దేశాన్ని కమ్మిన అసురశక్తుల పీడను విరగడ చేయడానికి శివానందమూర్తిగారు తన యావచ్ఛక్తినీ, తనకున్న తపోబలమంతటినీ ధారబోశారు. నిరుటి సాధారణ ఎన్నికల సమయంలో మంచంమీద కాలు కదిలించలేని నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఎవరికీ చెప్పాపెట్టకుండా తలచిందే తడవుగా దిగ్గున బయలుదేరి ఆయన కాశీ విశ్వనాథాలయానికి వెళ్లి, అన్నీ ఎవరో అమర్చిపెట్టినట్టుగా అక్కడ ప్రత్యేక పూజలు కావించి, మైళ్లదూరం చకచక నడిచి గంగాస్నానం చేసి, సమాజ క్షేమం కోసం దైవశక్తిని ఆవాహన చేసిన తీరు ఎవరికో తప్ప తెలియదు. పశ్చిమతీరం వలె, తూర్పుతీరం కూడా, వైభవంతో విలసిల్లి, ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టాలన్న మహాసంకల్పంతో ప్రపంచంలో కనీవినీ ఎరుగని రీతిలో భీమిలి ఆనందవనంలో సొంతఖర్చుతో ఆద్యాది మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించి, పూర్తిగా సొంత వనరులతో దాన్ని నిర్వహిస్తున్న వైనం ఎరిగినవారు ఆయన ప్రణాళికా నైపుణ్యాన్ని, కార్యదక్షతను, నిస్వార్థ త్యాగనిరతిని మెచ్చుకోకుండా ఉండలేరు. తాను మహాశైవ పీఠానికి అధిపతి అయికూడా శివకేశవ అభేదాన్ని నొక్కిచెబుతూ శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఏటేటా మహా వైభవంగా నిర్వహిస్తూ, ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, అకాడమీలు సైతం ఆశ్చర్యపడే రీతిలో వివిధరంగాల ప్రతిభామూర్తులను ఆయా సందర్భాల్లో సత్కరించడం ఆయనకే చెల్లింది.
అర్జీ పెట్టనిదే గౌరవడాక్టరేటు, పైరవీ చేయనిదే పద్మశ్రీ అయనా రాని ఈ కాలంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతి భను ఏనాడో చూపించిన విశిష్ట వ్యక్తులను వెతికి పట్టుకుని, లక్ష రూపాయల పైచిలుకు భూరి బహుమానాన్ని, ప్రతిష్ఠాత్మకమైన శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డును దయచేసి స్వీకరించవలసిందని ఏటేటా వినమ్రంగా పిలువనంపిన ఆదర్శమూర్తి శివానందమూర్తిగారు. తాను వేదవేదాంగా లను కాచివడబోసి, సనాతన ధర్మానికి పట్టుగొమ్మలా నిలిచిన హైందవ ధర్మాచార్యుడు అయ కూడా తన చిరకాల నివాస మైన భీమునిపట్నంలో చర్చిలకు, మసీదులకు సైతం విరాళాలిచ్చి, అన్ని మతాలవారినీ సమానంగా ఆదరించి సర్వధర్మ సమభావనకు ప్రతిరూపంగా నిలిచిన విశిష్ట వ్యక్తి ఆయన. వైదికవిద్యల్లో, యోగసాధనలో, ఆధ్యాత్మిక చింతనలో, మహామహులకు సైతం మార్గదర్శనం చేయ గలిగిన ‘గురువుగారు’ సామాన్యుల్లో కెల్లా సామాన్యులను సైతం వారి స్థాయకి దిగివచ్చి జ్ఞానబోధ చేయగలిగిన మనీషి. కఠ యోగానికి ఎంత గహనమైన వ్యాఖ్యానం చేసి, కాలచక్ర గతిని ఎంత లోతుగా కళ్లకు కట్టించారో, మహర్షుల చరిత్రలను అంత సరళంగా పాఠక జనానికి సైతం బోధ పరచగలిగిన మహా రచయత ఆయన. సద్గురు శివానందమూర్తిగ రు భౌతిక జీవన ప్రస్థానం చాలించినా జిజ్ఞాసువులను, దేశభక్తులకు, ధర్మ నిబద్ధుల కు గురు మూర్తిగా కలకాలం నిలిచే ఉంటా రు. త్రైలింగస్వామి, నృసింహ సరస్వతి, రమణ మహర్షి వంటి మహనీయుల కోవకు చెందిన ఈ ఆధునిక యోగీశ్వరుడి దివ్య స్మృతికి ఆంధ్రభూమి నివాళి.  By Visalakshi.P


12, జూన్ 2019, బుధవారం


11, జూన్ 2019, మంగళవారం


10, జూన్ 2019, సోమవారం

సచ్చిదానంద స్ఫూర్తి... శివానంద మూర్తి
1935-36 ప్రాంతాలలో నెల్లూరులో కొందరు శ్రీరమణ మహర్షి పటం ఎదురుగా కూర్చొని భజన చేస్తున్నారు. ఆ పటంలో నుంచి శ్రీ రమణులు వచ్చి... భజన చేస్తున్న వారిలో ఉన్న ఒక బాలుని చెక్కిలి నిమిరి అంతర్ధానమయ్యారు. ఈ సంఘటన ఆ బాలునికి తప్ప మరెవరికీ తెలియదు. ఆ బాలుని పేరు కందుకూరి శివానందమూర్తి. ఆ బాలుడే ఉత్తరోత్తరా గొప్ప యోగిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, జ్ఞానిగా.. కొన్ని వేలమంది హృదయాలలో ఆధ్యాత్మిక దీపాలను వెలిగించారు. జూన్‌ 10వ తేదీ శనివారం ఆ మహనీయుని పుణ్యతిథి. ఈ సందర్భంగా.. సచ్చిదానంద స్ఫూర్తిగా కీర్తి గడించిన శివానంద మూర్తి జీవిత విశేషాలు..

రువుశివానందమూర్తి గారు రాజమహేంద్రవరంలో 1928 డిసెంబరు 20న జన్మించారు. వీరి తల్లితండ్రులు కందుకూరి వీర బసవరాజు, సర్వమంగళాదేవి. గురువుగారు చిన్న వయసు నుంచీ అసమాన ప్రజ్ఞ ప్రదర్శించేవారు. వారి పన్నెండో ఏట ఒక ఉత్తర భారత యోగి.. కోరకుండానే ఆయనకు మంత్రోపదేశం చేశారు.

తన జన్మకొక ప్రయోజనం ఉందని చిన్ననాడే గ్రహించిన ఆయన.. సస్యశ్యామలమైన గోదావరీ డెల్టా ప్రాంతాన్ని విడిచి.. వరంగల్లు ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు ఆయన వయసు పదిహేడేళ్లే. ‘వెళ్తే వెళ్లావు గానీ, వెయ్యి రూపాయలన్నా తీసుకుని వెళ్ల’మని వారి తండ్రి ఎంత చెప్పినా... ‘నాకొక వంద రూపాయలు చాల’ంటూ వచ్చేశారాయన. వరంగల్లు చేరి పోలీసు శాఖలో నెలకు 140 రూపాయల జీతమ్మీద చిన్న ఉద్యోగం సంపాదించారు. ఆ శాఖలో ఎన్నో ఏళ్లు పని చేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. వారి వివాహం 1950లో జరిగింది. నలుగురు సంతానం. 1984లో సతీవియోగమైంది.

శివానందమూర్తిగారు ఉద్యోగ బాధ్యతలనూ, సంసార విషయాలనూ చూసుకుంటున్నా... యోగ సాధనని మాత్రం విడువక అందులో అద్భుతమైన ఫలితాలు పొందారు. అంతేకాక మన వేదవేదాంగ సంబంధమైన గ్రంథాలనూ, భగవద్గీతనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. జంగమ విజ్ఞాన సర్వస్వమయ్యారు. 1970 దశకం వచ్చేటప్పటికి తన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆసక్తి గల వారికి మన సనాతన ధర్మం గురించీ, ఉపనిషత్తుల గురించీ, గురుతత్త్వం గురించీ ఎన్నో ప్రవచనాలు చేశారు. వారు చెప్పిన విషయాలను ఎప్పటికప్పుడు రాసుకొని దాదాపు 1,500 పేజీల గ్రంథాన్ని తయారు చేశారు పుణ్యాత్ములు కొమాండూరి విద్యావతి- ఆమె భర్త శ్రీనివాసన్‌. గురువుగారు స్వయంగా ఎన్నో గ్రంథాలూ, వ్యాసాలూ రాశారు. ఏ గ్రంథానికదే గొప్పది. ఆయన కఠోపనిషత్తుపై రాసిన భాష్యం అతి విశిష్టమైనది.

ఆత్మానుభూతి పొందడానికి, ఆధునిక కాలంలో శ్రీరమణ మహర్షి బోధించిన ఆత్మమూలాన్వేషణ ఉత్తమ పద్ధతి అనేవారు. కానీ, ముముక్షువులెంత మంది ఉంటారు. సామాన్య ప్రజలకు కూడా ఒక మార్గం చూపాలనేవారు శివానందమూర్తి గారు. ఇతరుల పట్ల గల అక్కరని సూచించే వారి సందేశం చూడండి... ‘‘నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించేది ఒక్కటే నా అంతఃకరణలో నేను పొందిన క్షేమం, తృప్తి, శాంతి ఈ మూడూ అందరికీ ఈశ్వరుడివ్వాలి. దేశంలో సంక్షోభము, అశాంతి మొదలైనవి శాంతించాలనీ, మంచివారంతా సుఖపడాలనీ, అందరూ మంచివారు కావాలని కోరడం... భగవంతుని అందుకై ప్రార్థించడం, ఇదే నా కర్తవ్యం.

తృప్తి, అహింస, మత్సరం లేని సర్వభూత హితం, గొప్ప తపస్సు... ఇవి ప్రతి వ్యక్తికీ సాధ్యమే. అదే దేశమంతటా చేసిన ఈశ్వర ప్రతిష్ఠ అవుతుంది. ఎక్కడో ఆలయ ప్రతిష్ఠ కన్నా ఇది గొప్పది’’ (ఇది 2011 డిసెంబరు 20 తన 83వ జన్మదినాన గురువు శివానందమూర్తి గారు ఇచ్చిన సందేశం). ఉద్యోగ విరమణ తరువాత ఆయన ఆధ్యాత్మిక నిలయమనదగిన ‘ఆనందవనం’ అనే తోటలో స్థిరపడ్డారు. ఇది భీమునిపట్టణంలో ఉంది. ఈ తోటలోనే వానప్రస్థాశ్రమ దశకు చేరుకున్న వృద్ధ దంపతులు కూడా నివసించడానికి వీలుగా ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పించారు. ఆనందవనంలో ఇంకో రెండు విశేషాలున్నాయి. మొదటిది ఆయన సొంత లైబ్రరీ. దీనిలో అనేక విషయాల గురించి దాదాపు ఇరవైరెండువేల గ్రంథాలున్నాయి.

వీటన్నిటినీ ఆయన చదివారు. రెండోది... మహాలక్ష్మీదేవి దేవాలయం. మన దేశ పశ్చిమ తీరంలో ఉన్నంత సిరిసంపద తూర్పు కోస్తాలో లేదనీ, ఆ కొరతను తీర్చడానికి ఆయన ఈ ఆలయాన్ని ఉద్దేశించారు. ‘దైవభక్తి కన్నా... దేశభక్తి గొప్పది’ అని శివానందమూర్తి నమ్మకం. మన పుణ్యస్థలాలన్నింటినీ శిష్యబృందంతో పర్యటించారాయన. అంతేకాక వేదమతమైన హిందూ ధర్మానికి మూల స్తంభాలు యజ్ఞాలని చెప్పేవారు. లోక కల్యాణానికై... దేశంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు రెండు వందలకు పైగా యజ్ఞాలు నిర్వహించారు.

సనాతన ధర్మ ట్రస్టు నెలకొల్పి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి... అజ్ఞాత కళాకారులకు ఒక వేదిక కల్పించారు. ‘సుపథ’ అనే త్రైమాసిక పత్రికను స్థాపించి.. తద్వారా ఎన్నో ఆసక్తికరమైన, చారిత్రక విషయాల గురించి వ్యాసాలు రాసేవారిని ప్రోత్సహించారు. మన దేశ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన పాశ్చాత్యులూ, వాళ్లనే అనుసరిస్తూ రాస్తున్న భారతీయ చరిత్రకారుల కబంద హస్తాల నుంచి విముక్తి కలిగించాలనీ, భారత దేశ చరిత్రను సదవగాహనలో మళ్లీ రాయాలనీ అనుకునేవారు.
కఠోపనిషత్తునే విశ్లేషించిన ఆ మహాయోగికి మృత్యుభీతి ఎలా ఉంటుంది? మృత్యువు మన అధీనంలో ఉండాలంటూడేవారు. తదనుగుణంగానే తమ అవతార సమాప్తికి సంబంధించిన నిర్ణయం తీసుకుని... ముందుగానే తన కుమారునికి చెప్పి స్వచ్ఛందంగా దేహత్యాగం చేశారు.

2015 జూన్‌ 10న వరంగల్‌లో ఇది జరిగింది. వారి సమాధి కూడా అక్కడే ఉంది. దీనిని గురుధామం అంటారు. భీమునిపట్టణంలోని ఆనందవన ఆశ్రమమూ, వరంగల్‌లోని గురుధామమూ గురువుగారి స్మృతికి శాశ్వత నిలయాలు. ఇవి కాక కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్న బలుసుపాడు అనే గ్రామంలోని గురుధామంలో ఆయన కాంస్య విగ్రహముంది. శివానందమూర్తి గారి బోధనలు సదా ఆచరణీయం. అజ్ఞానాన్ని దూరం చేసే వెలుగు రేఖలు. భాగవతోత్తముడైన గురువుగారిని తలచినంత మాత్రాన ఆనందం కలుగుతుంది. అందుకే ఆయన సదా స్మరణీయుడు.

-పింగళి సూర్యసుందరం

ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి సేకరణ By KK
http://www.andhrajyothy.com/artical?SID=423973

9, జూన్ 2019, ఆదివారం

*ఓ పవిత్ర స్మరణ*

【ఈ రోజు (జూన్ పది) పూజ్యులు, శివైక్య సద్గురు 'కందుకూరి శివానంద మూర్తి' గారి వర్ధంతి  సందర్భంగా...】

సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారు సాధారణ జీవితం గడిపిన గృహస్థ సాధువు. ఆ రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి తమదైన సమాజ సేవకు అంకితమయ్యారు. సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, వైజ్ఞానిక విప్లవం తీసుకురావడం మొllవంటివి మాత్రమే సమాజ సేవలు అనుకుంటే పొరపాటు. ధర్మాన్ని తెలపటం తద్వారా మానవీయ  నైతిక విలువలు  దెబ్బతినకుండా చూడటం, ఙ్ఞాన వైరాగ్యాల పట్ల  జిజ్ఞాసను  కలిగించడం తద్వారా అనవసర విషయాలపై వెంపర్లాటకు లోనుకాకుండా ప్రజల్లో చైతన్యం తేవడం వంటివి కూడా అత్యుత్తమ సమాజ సేవలే. సద్గురు శివానంద మూర్తిగారు చేసిన ఈ తరహా సమాజ సేవ మనఃవందనీయం.
ఇల్లు, సంసారం, పిల్లలు వీటిని తలకు మించిన భారంగా భావించే వారికి వీరి జీవనవిధానం ఒక మేలుకొలుపు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తమ పిల్లలను పదిమందికి పనికొచ్చే మంచి పౌరులుగా తీర్చిదిద్దారు శివానంద మూర్తిగారు. రకరకాల భారాలను మానసికంగా మోస్తూ కూడా ప్రసన్నవదనంతో సౌమ్యంగా ప్రవర్తించేవారు సద్గురు. వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసి వీరిని  విశ్వసించిన సమాజ సమూహానికి సుఖ ప్రదమైన జీవితాన్ని అవలంబించుకునేలా మార్గనిర్దేశం చేశారు.  స్వధర్మాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని తమవంతు బాధ్యతగా సుబోధ చేశారు. గుండెలకు హత్తుకునేలావుండే  మృదువైన మితభాషతో అమిత విషయపరిజ్ఞానాన్ని ప్రబోధించేవారు. వీరి నిర్మలమైన మనసును,  ఙ్ఞాన సంపదను గుర్తించిన అనుగాములు దైవంగా తలచి  సద్గురువని భావించేవారేగాని  శివానంద ముర్తిగారు తమకైతాము  ఎన్నడూ దైవంగా ప్రకటించుకోలేదు సరికదా గురువుగా కూడా ప్రకటించుకోలేదు. కేవలం హితబోధ ద్వారానే కాకుండా తమ నడవడికద్వారా కూడా ఆదర్శాలకు నిదర్శనంగా నిలిచారు సద్గురు.
     
ఇది రచన కాదు...
సద్గురునిపై  కృతజ్ఞతతో నివేదించిన
నా హృదయ స్పందన...
ఓ పవిత్ర స్మరణ...9052116568  ప్రహ్లాద్ నెల్లుట్ల    రచయిత సినీరంగం
         
                          -ప్రహ్లాద్


🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

8, జూన్ 2019, శనివారం


7, జూన్ 2019, శుక్రవారం



6, జూన్ 2019, గురువారం


*గరికకు లొంగిపోయే గణేశుడు...*by I. Umashankar

గణేశుడు భక్తసులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా ఫర్వాలేదు. ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వాగణపతి అని కూడా పిలవడం కద్దు. దూర్వాయుగ్మమ్‌ అంటే గరిక కదా! వినాయకునికీ గరికకీ మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఈ రెండే...

తాపాన్ని ఉపశమించేందుకు :-
పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షసప్రవృత్తికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిదచేసేందుకు బయల్దేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గా లన్నీ మూసుకుపోగా, దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తూ గరళాన్ని మింగినట్లుగానే, వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు. ఎన్ని ఔషధిలు వాడినా ఆ తాపం తగ్గలేదు. చివరికి శివుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందన్నది ఒక కథ.
శివపార్వతుల పాచికలు:-
శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నా రు. వారి ఆటకు న్యాయనిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరికబొమ్మ ఎంతసేపూ శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి, అతడిని కుంటివాడివి కమ్మని శపించింది. తన కుర్రచేష్టలను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆ గరికబొమ్మ వేడుకోగా... వినాయకచవితినాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజావిధానాన్ని తెలుసుకుని, ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శావిమాచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశు ని పూజలో భాగమయ్యిందంటారు.

*ఔషధి తత్వం:*

గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధికప్రాధాన్యం. కొందరైతే ఆయనకు వాడే ఏకవింశతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. తమిళనాట వాడవాడలా కనిపించే గణేశుని ఆలయాలలో, భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. గరికకు త్రిదోషాలనూ హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటిలేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు, ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు. ఇక మూత్రంలో కానీ, విరేచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని విశ్వసిస్తా రు. మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకొని వడ దెబ్బ వరకూ గరికను సర్వరోగాలను ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. మొత్తానికి గరిక ప్రకృతికి, నిరాడంబరతకు చిహ్నం. అందులోని ఔషధి గుణాలు జీవానికి చిహ్నం. అంతటి గరిక ఆ గణేశునికి చేరువకావడంలో తప్పేముంది.

5, జూన్ 2019, బుధవారం


4, జూన్ 2019, మంగళవారం


3, జూన్ 2019, సోమవారం



2, జూన్ 2019, ఆదివారం


1, జూన్ 2019, శనివారం