10, జులై 2019, బుధవారం

మహాదేవ

ప్రియమైన

మిత్రులకు

శుభాభినందనలు

క్రింది చిత్రానికి  నా రచన......

గోపకాంతలు యశోదమ్మ వద్దకు వచ్చి, కృష్ణుని ఆగడాలు చెప్పగా విన్న యశోదమ్మ కృష్ణునితో పలికెడి పలుకులు..........

కం!!
మిక్కుటమగు పాలుఁబెరుగు
వెక్కసముగ మెక్కినాడ వీవని భామల్
పెక్కుడు మాటలు బలుకగ,
అక్కట! నామనము, ఖేద, వారిధి, మునిగెన్.....

కం!!
లేవా! వెన్నఁ బెరుగిచట,
ఈవా! గోవులు, కడవల నిండుగ పాలన్
రావే ! సరిపడి నంతగ,
నీవేల చనియెదొ యితర నిలయమ్ములకున్......

కం!!
ఓపగ లేనిక వనితల
తూపుల బోలెడి,‌పలుకుల, తోయజ నయనా
పాపడ వంచును దలచితి,
నీ పనులీరీతి నుండ నే నెట‌ బోదున్..

కం!!
కొట్టగ లేకుంటిత్తరి
మొట్టగ లేనైతి నిన్ను ముద్దుల కూనా
బిట్టుగ నలుకను పూనను,
యెట్టుల దీరును జగడము యిప్పుడు కృష్ణా......

కం!!
కట్టెద నిన్నీ రోటను
చుట్టెద పాశము,పదుగురు చోద్యము జూడన్,
ఎట్టిది నాకీ ఖర్మము,
ఎట్టిదొ నా పాపఫలము యిట్టుల గలిగెన్.....

కం!!
కరము లాడవు బంధింప కన్నతండ్రి,
బుధ్ది దోచనీ యదకట బుజ్జి నాన్న,
మనసు యింతైన నొప్పదు మాదు కూన,
ఏమి సేయుదు నిప్పుడు వెర్రి, దాన...

వచనము...ఇట్లు,యశోదాదేవి ద్వైదీభావనతో యేమియు చేయకుండెను
                   

             ( ముదిగొండ రవి శంకర్ )


.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి